Thursday, February 9, 2012

Arunachalam Temple Information అరుణాచలం తిరువణ్ణామలై


అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ..అరుణాచలా 

ఈ పొస్ట్ లో మీకు అరుణాచలేశ్వరాలయము ( Arunachalam Temple Information) , గిరిప్రదక్షణ (Girivalam) వివరములను తెలియచేస్తాను, నాకు అరుణాచలం (Arunachalam) (Tiruvannamalai) కోసం తేలుసుకోవడానికి 2 నెలలు సమయం పట్టింది. చెన్నై నుంచి 4-5గంటల ప్రయాణం, తిరుపతి నుంచి కూడ ట్రైన్ లు ఉన్నాయ్  . సరె రండి అరుణాచలం(Arunachalam) చుద్దాం . 


అరుణాచలము(Arunachalam) అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" (Tiruvannamalai) అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ.  ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు .

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము . అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ , దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి  శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది.

ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము  చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. దక్షిణభాతరతంలో  వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక .
పంచభూతలింగక్షేత్రములు
1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం
త్వరలోనే మీరు నా బ్లాగు లో పంచభూతలింగక్షేత్రములు చూసి మీకు తెలియచెస్తాను .
 అరుణాచలేశ్వరాలయము
అరుణాచలేశ్వరాలయము  అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితొ ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి . నాగుగుదిక్కులు నాలుగు రాజగొపురములు  ఉంటాయి . 

  తూర్పు రాజగోపురం 
 దక్షిణగోపురము

పాతాళలింగము
ఇక్కడే రమణమహర్షి (Ramana Maharshi)కొంతకాలం తపస్సు చేసారు . రమణ మహర్షి ఫొటొలు  కూడ ఇక్కడ ఉన్నవి .మీరు వాటిని కూడ వచ్చు .. అక్కడికి వేల్లినప్పుడు అండి.   ఫొటొ చుస్తున్నారా మెట్లద్వార క్రిందకు దిగితె పాతాళలింగము ఉంటుంది       
  ఒకసారి అరుణాలేశ్వర దేవాలయములో ముఖ్యస్థానముల లిష్ట్ చూస్తే  మిగిలనవి చూపిస్తాను .
పెద్ద నంది       

వెయ్యిస్తంభాల మండపము

ఈ గోపురమే  చిలుక (కిలి) గోపురం .. అరుణగిరినాధర్ కధ తెలుసుకధా మీకు ..ఈ గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించరంటా .. ఈ గోపురంలో అరుణగిరినాధుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు.  మీకు గోపురం పైన చిలుక కూడ కనిపిస్తుంది .

బ్రహ్మ  ప్రతిష్ఠింఛిన లింగం 
గర్భగుడి లో  పరమ  పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూ లింగము సుందరమై, సురుచిరమై , సర్వసిద్ది ప్రదమై , పానపట్ట్ముపై విరాజిల్లుతూ  ఉంటుంది.      
 ఇది త్రిమూర్త్యాత్మకము గనుక ఇక్కడ ఇతర దేవతారాధన జరుపనవసరము లేదు. ఈ అలయం ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది .ఇక్కడే  మీరు పంచ లింగాలయల దర్శనం  కూడ చెయవచ్చు.
  ఏకాంబరేశ్వరుడు
 చిదంబరేశ్వరుడు.. 
  జంబుకేశ్వరుడు
  కాళహస్తేశ్వరుడు
ఈ ఆలయం లో  శివగంగతీర్ధము , బ్రహ్మాతీర్ధము ఉన్నాయి. వాటిని కొన్ని ముఖ్య రోజుల్లో  మాత్రమే   తెరుస్తారు 
శివగంగతీర్ధము
  బ్రహ్మాతీర్ధము
.
మీకు చూపిస్తున్న ఫొటొలు నేను తిసినవి కాకపొవడం   వళ్ళ .. మిగతావి చుపించలేకపొతున్నాను   :(   
* తమిళ దేశం లో ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు  .. సాయంత్రం  3.45 - 4.00 కి తెరుస్తారు . రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు
* పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
ఈ ఆలయం చాల పెద్దది కావడం వళ్ళ మీరు లొపలనే ఉండవచ్చు( పండగ సమయం లో లొపలికి అనుమతించారు ) .  గర్బగుడి ఒకటె తెరచి ఉండదు .
 


మీకో విషయం చెప్పడం మరిచాను . కిలి గోపురానికి ఎదురుగా  మరో గోపురం ఉంటుంది దానికి అనుకుని సుబ్రహ్మణ్యుల గుడి   ఉంటుంది, మరోల చెప్పలంటే పెద్ద నందికి ఎదురుగ కుడి  పక్కన ఉంటుంది . మీరు స్వామి ని దర్శించుకుని వచ్చెకుండా .. పక్కనే ఒకగది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్య ముద్రలు చిత్రికరించినవి అద్భుతంగ ఉంటాయి .
*  బస్ స్టాండు కు దగ్గరలోనే దేవాలయం ఉంటుంది (సుమారు 2 కి.మి )
గిరి ప్రదక్షణం (గిరివలం _ Girivalam)
ఈ అరుణాచలం(Arunachalam) పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. 

శ్రీరమణులు(Sri Ramanulu) దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు.   గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .

  గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి.  అవి 

 అగ్ని లింగం రమణాశ్రమానికి (Ramana ashramam)వేళ్ళే దారిలో కనిపిస్తుంది..
గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం  కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు . రమణ ఆశ్రామానికి  2కి.మి దూరం వెళ్ళిన  తరువాత  కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది .  
అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది .  
 దారిలో మనకు తీర్దములు కనిపిస్తాయి కాని వాటిని వారు పెద్దగ పట్టించుకున్నట్టు కనిపించదు ...
మీరు జాగ్రత్తగ చూడగలిగితే .. రాజరాజేశ్వరి దేవాలయం తరువాత మీకు..  
శ్రీరమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, గళశగుడి అగస్త్యతీర్థం, 
ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం, నైరుతిలింగం, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం, రామలింగేశ్వరాలయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణాలింగం, ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం, ఈశాన్యలింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి  ఆశ్రమం, దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తే, అది ప్రదక్షిణం.

* గిరిప్రదక్షణం  చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది. 
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం  మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు .
పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం  శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
*నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం  ఉంటుంది.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .

http://www.arunachaleswarar.com/
 రమణాశ్రమం (Ramana Maharshi Ashram)


 రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మి దూరం లో ఉంటుంది. అరుణాచలం(Arunachalam) వేళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ అరవవాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు . సాయంత్రం సమయం లో రమణాశ్రమంలో చెసే ప్రార్దన  చాల బాగుంటుంది . రమణాశ్రమంలో  రమణుల  సమాధిని మనం చూడవచ్చు  . 

రమణాశ్రమం(Ramana ashramam) లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నేమళ్ళు కూడ స్వేచ్చాగ తిరుగుతూంటాయి . రమణాశ్రమం లో ఇంకా లక్ష్మి (ఆవు) సామధి , కాకి సమాధి , కుక్క సమాధి నికూడ ఛుడవచ్చు . ఇవన్ని వరుసాగ ఉంటాయి . అక్కడ  గ్రంధాలాయం  లో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి . మీరు ఆశ్రమం   లో ఉండలాంటె మిరు ముందుగానె బూక్ చెసుకొవాల్సి ఉంటుంది.(రమణమహర్షి వారి జీవిత విశేషాలను నా వేరె బ్లాగులో త్వరలో వివరిస్తాను..http://bhajagovindamadishankara.blogspot.in/ )


http://www.sriramanamaharshi.org/
           శేషాద్రి స్వామి ఆశ్రమం (Seshadri Swami Ashram)
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడ అక్కడే ఉంది.  ఇక్కడ కూడ ఉండటానికి రూం లు ఉన్నవి. మీరు ముందుగానే రూం లను బూక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను . నేను వేళ్ళినప్పుడు నాకు రూం లు ముందుగ బూక్ చేసుకోవాలని తేలియక ఇబ్బంది పడ్డాను.
***
మీరు అరుణాచలం వేళ్ళబోయే ముందు గురువు గారు(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు) చెప్పిన అరుణాచల  ప్రవచనం విని వేళ్ళండి.

http://telugu.srichaganti.net/Arunachalam.aspx
Hotel / Ashramam Accommodation in Tiruvannamalai
వసతి కావాల్సిన వాళ్ళు నేరుగా సంప్రదించండి. 
1. President,
Sri Ramanasramam,
Sri Ramanasramam post,
Tiruvannamalai – 606 603.
Tamilnadu.
email:- ashram@sriramanamaharshi.org
website:- www. sriramanamaharshi.org


2. SIVA SANNIDHI,
Ramana Nagar Post Office,
Siva Sannidhi Street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-235089
Cell:- 9789378779

3. ANDHRA ASHRAMAM,
Opp. Sri Ramanasramam,
Chengam road, 3rd street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236174

4. President,
Sri Seshadri Swamigal Asramam,
Room No. 8,
Chengam Road, TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236999, 238599, 236740. 


చైత్ర పూర్ణ మినాడు  సాక్షి పేపర్ లో వేసిన పోస్ట్ ఇది (7-5-2012)

 13- 10 - 2013

Girivalam Calendar-2014


MonthGirivalam Day*Start Date, Day, TimeEnd Date, Day, Time
January15-Jan-2014 - Wednesday15-Jan-2014,Wed, 07:30AM16-Jan-2014, Thu,10:33AM
February14-Feb-2014 - Friday14-Feb-2014,Fri, 03:39AM15-Feb-2014, Sat, 05:58AM
March15-Mar-2014 - Saturday15-Mar-2014,Sat, 09:25PM16-Mar-2014, Sun,10:20PM
April14-Apr-2014 - Monday14-Apr-2014,Mon, 01:13PM15-Apr-2014, Tue,01:12PM
May14-May-2014 - Wednesday14-May-2014,Wed, 02:14PM15-May-2014, Thu,12:45AM
June12-Jun-2014 - Thursday12-Jun-2014,Thu, 12:27PM13-Jun-2014, Fri,09:41AM
July11-Jul-2014 -Friday11-Jul-2014,Fri, 03:01AM12-Jul-2014, Sat,08:33PM
August10-Aug-2014 -Sunday10-Aug-2014,Sun, 04:55PM11-Aug-2014, Mon,03:36PM
September08-Sep-2014 - Monday08-Sep-2014,Mon, 10:48AM09-Sep-2014, Tue, 07:07AM
October07-Oct-2014 -Tuesday07-Oct-2014,Tue, 07:13PM08-Oct-2014, Wed, 04:27PM
November06-Nov-2014 - Thursday06-Nov-2014,Thu, 05:35AM06-Nov-2014, Thu, 03:52AM
December05-Dec-2014 -Friday05-Dec-2014,Fri, 06:18AM06-Dec-2014, Sat, 05:56AM

Girivalam Calendar-2013


Month Girivalam Day* Start Day Start Date Start Time
End Day End Date End Time
January 26-Jan-2013 Sat 26-Jan-2013 09:40 am
Saturday Sun 27-Jan-2013 10:56 am
February 25-Feb-2013 Mon 25-Feb-2013 02:54 am
Monday Tue 26-Feb-2013 03:02 am
March 26-Mar-2013 Tue 26-Mar-2013 04:49 pm
Tuesday Wed 27-Mar-2013 03:38 pm
April 25-Apr-2013 Thu 25-Apr-2013 03:54 am
Thursday Fri 26-Apr-2013 02:10 am
May 24-May-2013 Fri 24-May-2013 12:38 am
Friday Sat 25-May-2013 10:27 am
June 22-June-2013 Sat 22-June-2013 08:01 pm
Saturday Sun 23-June-2013 05:32 pm
July 22-Jul-2013 Mon 22-Jul-2013 03:01am
Monday Tue 23-Jul-2013 12:35 am
August 20-Aug-2013 Tue 20-Aug-2013 10:19 am
Tuesday Wed 21-Aug-2013 08:18 am
September 18-Sep-2013 Wed 18-Sep-2013 07:03 pm
Wednesday Thu 19-Sep-2013 05:40 pm
October 18-Oct-2013 Fri 18-Oct-2013 05:00 am
Friday Sat 19-Oct-2013 05:33 am
November 16-Nov-2013 Sat 16-Nov-2013 08:30 pm
Saturday Sun 17-Nov-2013 08:56 pm
December 16-Dec-2013 Mon 16-Dec-2013 01:21 pm
Monday Tue 17-Dec-2013 02:59 pm


జీవితం లో ఒక్కసారైన చూడవాల్సిన ప్రదేశాలలో అరుణాచలం ఒకటి. 

అరుణాచలం నుంచి కాంచీపురం (కంచి) బస్సు సౌకర్యం కలదు .

****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి ****